వారంలో ధర 150 జంప్

పదిరోజుల క్రితం కొన్నిచోట్ల కిలో రూ.50. మరికొన్ని చోట్ల అయితే కొనేవారే లేక ఉచితంగా పంచిపెట్టిన పరిస్థితి. పదిరోజులు తిరిగేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పడు కిలో రూ.190దాకా ఎగబాకింది. ఇదీ కోడికూర పరిస్థితి. కోడికూర తింటే కరోనా వస్తుందన్న తప్పుడు ప్రచారంతో కొనేవారు లేక మార్చి మధ్యలో చికెన్‌ ధరలు అమాంతం పడిపోయాయి. చికెన్‌ తింటే కోవిడ్‌-19 వ్యాధి రాదు అని ప్రభుత్వం, వైద్యులు, పరిశోధకులు.. ఎవరు చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు. కొద్దిరోజులు తినటం మానేద్దాంలే అనే ఆలోచనతో చికెన్‌ దుకాణాలవైపు కన్నెత్తి చూడలేదు. దాంతో కొనుగోళ్లు అమాంతం పడిపోయి పౌల్ర్టీ రైతు నిలువునా మునిగిపోయాడు.