కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని బదూరియా పట్టణంలో స్థానికులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. తమకు రేషన్ సక్రమంగా ఇవ్వడంలేదంటూ బదూరియా వాసులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున రోడ్ల మీదకు రావద్దని, అందరూ ఇండ్లలోకి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కాగా, తమకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని, అందుకే రోడ్డుకెక్కామని స్థానికులు వాదించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయగా స్థానిక మహిళలు చీపుళ్లతో పోలీసులపై తిరగబడ్డారు. దీంతో బదూరియాలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
బదూరియాలో స్థానికులు, పోలీసులకు మధ్య ఘర్షణ